NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇరిగేష‌న్ ఏఈ పై ఎమ్మెల్యే దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ ఇరిగేషన్‌ ఏఈ సూర్యకిరణ్‌పై రెచ్చిపోయి మూడు సార్లు చెంప దెబ్బకొట్టారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే పుష్కర కాలువకు సంబంధించి రెండేళ్ల కిందట తన అనుచరులు కాలువ నిర్వహణ పనులు చేశారని.. దీనిపై ప్రస్తుత ధరలతో అంచనాలు తయారు చేయాలని సుమారు ఆరు నెలలుగా ఎమ్మెల్యే.. ఏఈపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అప్పటి పనులకు ఇప్పుడు అంచనాలు వేయలేమని.. పైగా ఆ కాలువలు కూడా చిన్నవని, అంచనాల తయారీ కష్టమంటూ సూర్యకిరణ్‌ చెబుతూ వస్తున్నారు. పుష్కర పనులపై తాను వివరణ ఇస్తుండగా ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి తనను మూడు సార్లు చెంపపై కొట్టారని.. ప్రభుత్వ ఉద్యోగినైన తనపై దౌర్జన్యం చేశారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని సూర్యకిరణ్‌ సీఐ మధుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

                                      

About Author