రబ్బాని బ్రదర్స్ విందుకు.. హాజరైన ఎమ్మెల్యే
1 min read
హాజరైన అధికారులు నాయకులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మరియు గ్రామాల్లో సోమవారం పవిత్ర రంజాన్ పండుగను సంతోషాల నడుమ మైనారిటీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు.ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించిదర్గాల దగ్గర మైనారిటీ సోదరులు చిన్నారులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.నందికొట్కూరు పట్టణంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ మరియు రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విందుకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి మరియు నాయకులు హాజరై విందును స్వీకరించారు.రబ్బానీ బ్రదర్స్ స్వగృహానికి వచ్చిన ఎమ్మెల్యేకు అల్ హజ్ హాజీ మహబూబ్ సాహెబ్,వైస్ చైర్మన్ రబ్బానీ,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రబ్బానీ బ్రదర్స్ కు ఆత్మీయ కౌగిలితో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం సంప్రదాయ కరమైన రుచికరమైన వంటకాలతో విందును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐలు సుబ్రహ్మణ్యం,ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకులు కాతా రమేష్ రెడ్డి,ప్రసాద రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,జమీల్ భాష,సోషల్ మీడియా పసుల శ్రీనివాసులు నాయుడు తదితరులు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
