PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ .13.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం లో రూ 13.30 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శుక్రవారం భూమి పూజ చేశారు. 3 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కంబాలపాడు నుంచి కోయిలకొండ రహదారి బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భూమి పూజ చేశారు. అలాగే   7 కోట్ల 95 లక్షలతో నూతనంగా నిర్మించనున్న టి.గోకులపాడు గ్రామంలో హంద్రీ నదిపై బ్రిడ్జి,రహదారి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అనంతరం కంబాలపాడు గ్రామంలో 20.94 లక్షలతో నూతనంగా నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్ ను ఎమ్మెల్యే  ప్రారంభించారు.అలాగే తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామంలో 2 కోట్ల 35 లక్షలు అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే   భూమి పూజ గావించారు. సీఎం జగనన్న హామీ అమలకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే కంగ్రాట్స్ శ్రీదేవి స్పష్టం చేశారు.ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన పత్తికొండ నియోజకవర్గం.. ఇప్పుడు ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ప్రాంతం జరిగిన అభివృద్ధి తో పత్తికొండ నియోజకవర్గ రూపురేఖలతో అబ్బుర పరుస్తుందని చెప్పారు. నియోజకవర్గంలోని క్రిష్ణగిరి మండలం గత కొన్ని ఏళ్లుగా కేఈ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం అని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు.ఇటీవల పత్తికొండకు జగనన్న వచ్చినప్పుడు నియోజకవర్గంలోని క్రిష్ణగిరి మండలం లోని టి.గోకులపాడు వద్ద హంద్రిపై, కోయిలకొండ నుంచి కంబాలపాడు వరకు రహదారితోపాటు బ్రిడ్జి, తుగ్గలి మండలం బొందెమడుగుల వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  సీఎం దృష్టికి తీసుకురాగా, ఆరోజు హామీ ఇచ్చిన సీఎం జగనన్న వాటి నిర్మాణానికి టీ గోకులపాడు వద్ద హంద్రీ పై బ్రిడ్జి ఏర్పాటుకు రూ.7.95 కోట్లతో, అలాగే కంబాలపాడు నుండి కోయిలకొండ వరకు రహదారి తో పాటు బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు బొందిమడుగుల రహదారి బ్రిడ్జి పనులకు 2.35 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని ఆమె తెలిపారు. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంత ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండలం వైయస్సార్ పార్టీ నాయకులు, అధికారులు గోకులపాడు,   కంబాలపాడు, కోయిలకొండ, బొందిమడుగుల గ్రామాల వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author