మరియతల్లి స్వరూపం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
1 min readనిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తా:ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో మరియ తల్లి స్వరూపం నిర్మాణానికి ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ గురువులు ఫాదర్ డి. మధు బాబు ఆధ్వర్యంలో బుధవారం ఉ 10:30 కు నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ భూమి పూజ చేశారు.గ్రామంలో ఆర్సిఎం సంగస్తులకు కేటాయించిన సమాధుల పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హాజరయ్యారు.ఎమ్మెల్యే వచ్చిన వెంటనే ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనకు తోడు నీడగా ఉంటూ దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారని మనం దేవుని పట్ల విశ్వాసంతో ఉండాలని మా ఇంటి దేవుడు మరియ తల్లి అని నాకు ఏమైనా సమస్యలు ఇబ్బందులు కోరికలు ఉన్నట్లయితే వాటిని మరయతల్లికి ప్రార్థన ద్వారా విన్నవిస్తే అవన్నీ కూడా తొలగించి పోతున్నాయని మేము మా కుటుంబంతో కలిసి ప్రతి ఏడాది తమిళనాడులో ఉన్న వేలాంగణికి వెళ్లి ప్రత్యేకంగా దర్శించుకోవడం జరుగుతూ ఉందని అన్నారు. నేను నిర్మాణానికి తన వంతుగా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యేను శాలువా పూల మాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కడుమూరు గోవర్ధన్ రెడ్డి,వీరారెడ్డి,ఎస్ఐ జగన్ మోహన్,జిల్లా కార్యవర్గ సభ్యులు ఇనాయతుల్ల,వెంకట్,నడిపి నాగన్న,చంద్రశేఖర్ రెడ్డి,అనిల్, ముడియాల వెంకట రమణారెడ్డి,బ్రదర్లు థోమాస్,మరియ రాజ్,జాన్,ఆనందరావు,స్వామిదాసు, స్వామన్న,ప్రసాద్,హరి,సూరి,శేఖర్,సుబ్బయ్య వివిధ గ్రామాల విశ్వాసులు పాల్గొన్నారు.