మత్స్యకారులకు టీవీఎస్ మోపెడ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు బెస్త కాలనీకి చెందిన ఐదు మంది మత్స్యకారులకు బుధవారం టీవీఎస్ మోపెడ్లు కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75 వేల రూపాయల టీవీఎస్ మోపిడ్ వాహనాన్ని 40 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు ఇవ్వడమే కాకుండా వారికి ఐస్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు, మత్స్యకారులు ఈ వాహనాల మీద గ్రామాలకు వెళ్లి చేపల వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వీటిని అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు 60 శాతం సబ్సిడీతో ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 10 లక్షల నుండి 20 లక్షల వరకు (ఫిష్ కియోస్క్) అలాగే 50 లక్షల రూపాయలతో (ఫిష్ వేల్యూ ఆడేడ్) విలువ గల మత్స్య రంగానికి సంబంధించిన పథకాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు, ఆసక్తి కలిగిన వారు మత్స్య శాఖ నువ్వు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మడక వెంకటసుబ్బయ్య, రామాంజనేయులు, డాక్టర్ పిచ్చయ్య, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు వెంకటరమణ మత్స్య అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్ గ్రామ మత్స్య సహాయకురాలు మస్తానమ్మ, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.