లబ్దిదారులకు సీయం సహాయ నిధి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి బర్రింకాలపాడు న్యూస్ నేడు: జీలుగుమిల్లిబడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక సహకారం గా సీయం సహాయ నిధి ఎంతగానో తొడపాడుతుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు సీయం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.బడుగు బలహీన వర్గాల కు ఎన్డీఏ ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తోందని,ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదప్రజల సహాయార్థం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం ఆనందదాయకమన్నారు. పేద ప్రజల ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ చూపించే ఏకైక ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము కూటమి నాయకులు పాల్గొన్నారు.