అభిమాన నేత ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కి జ్ఞాపిక అందజేత
1 min read
మహాత్మా స్టూడియో వారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి జ్ఞాపిక చిత్రం అందజేత
పల్లెవెలుగు , ఎమ్మిగనూరు: పట్టణంలో అభిమాన నేత ఎమ్మిగనూరు అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి కి నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందజేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మహాత్మా ఫోటో స్టూడియో వారు జ్ఞాపిక చిత్రంను ఎమ్మెల్యే బీవీ ని అందించారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మిగనూరులో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై, మరోపక్క ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసినందుకు కృతజ్ఞత భావంతో జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నిరంతరం కృషి చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, మహాత్మా ఫోటో స్టూడియో సిబ్బంది పాల్గొన్నారు.