NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గోనెగండ్ల : గోనెగండ్ల మండల పరిధిలోని ఎర్రబాడ గ్రామం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్ర కోట చెన్నకేశవ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలో 7 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనానికి ప్రారంభోత్సవం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 8 అదనపు తరగతి గదుల గాను ఒక కోటి 98 లక్షల తో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ అరుణ జ్యోతి అధ్యక్షతన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల జీతలా కోసమే, ప్రభుత్వం కు వచ్చిన ఆదాయంలో 75??? ఖర్చు చేస్తూ, 25 ప్రజలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, మనకు వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ అన్నారు. ఉపాధ్యాయులు ఎవరైనా స్కూల్ కు సరిగ్గా రకపోతే నాకు కంప్లైంట్ చేయండి వారి భరతం పడతా అని ఎమ్మెల్యే చెన్నేకేశవ రెడ్డి హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నసిరుద్దీన్, సింగిల్ విండో అధ్యక్షులు కాశీ విశ్వనాథరెడ్డి, గోనెగండ్ల మాజీ సర్పంచ్ నగేష్ నాయుడు, వైసిపి మండల కన్వీనర్ దొరబాబు నాయుడు, మురళి నాయుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, పెద్ద మరి వీడు ఉపసర్పంచ్ నరసన్న చారి, వైసిపి యూత్ అధ్యక్షులు బందీ నమాజ్, ఉంచాల రంగన్న, సప్లయర్ రఫీ, పద్మనాభం, నదిముల్లా, అధికారులు తాసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈఓ వినోద్ కుమార్, ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామస్తులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author