ఆరోగ్య సురక్ష ఆంధ్రప్రదేశ్ సాధనే జగనన్న లక్ష్యం.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యానికి రక్షణ కల్పించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. గురువారం పెండేకల్ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పత్తికొండ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆమె ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు డాక్టర్ జి. ప్రతిమ,సింగల్ విండో అధ్యక్షులు అట్లా గోపాల్ రెడ్డి, సర్పంచ్ లీలావతి, ఎంపీటీసీ పెద్ద రంగన్న సచివాలయ కన్వీనర్ అట్లా బసిరెడ్డి, సిసి రంగన్న మాజీ ఎంపీటీసీ, గంగన్న,ఫీల్డ్ అసిస్టెంట్ దివాకర్ రెడ్డి,తదితరులు ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మా మాట్లాడుతూ శిబిరానికి వచ్చిన ప్రజలందరికీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేస్తారని, అందువల్ల ప్రజలు ఓపికతో ఉండి వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఇళ్లకు వెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సావిత్రి, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, సిహెచ్ఓ అన్నపూర్ణ, ఆప్తాలిక్ అసిస్టెంట్ హనుమంత్ రెడ్డి, పి హెచ్ ఎన్ సరస్వతి ,సూపర్వైజర్లు నాగమ్మ ,వెంకటరమణయ్య, హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర, ఫార్మసిస్టు రమేష్, ల్యాబ్ టెక్నీషియం మౌలాలి, పంచాయతీ కార్యదర్శి అంకాలప్ప ,వీఆర్వో వెంకట్ రాముడు, హెల్త్ కార్యదర్శి మేరీ, వైఎస్ఆర్సిపి నాయకులు నాగభూషణ్ రెడ్డి,రామకొండ, సుధాకర్ రెడ్డి, మారెళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి, నునసరాళ్ల గోపాల్ రెడ్డి, డాక్టర్ రంగారెడ్డి, శభాష్పురం రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.