సర్పంచ్ కు ఎమ్మెల్యే జయసూర్య నివాళులు..
1 min read
కుటుంబాల సభ్యులకు ఎమ్మెల్యే ధైర్యం..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని బైరాపురం గ్రామ సర్పంచ్ కదిరి ఫణి భూషణ్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే.గురువారం ఉదయం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సర్పంచ్ ఇంటికి చేరుకొని ఎమ్మెల్యే ఫణి భూషణ్ రెడ్డి మృదేహానికి నివాళులు అర్పించారు.అదే విధంగా జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించారు. ఎమ్మెల్యే ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందికొట్కూరు మండలం కోనేటమ్మ పల్లె గ్రామానికి చెందిన బోరెల్లి యేసురాజు గుండెపోటుతో మరణించారు. ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.మరణించిన కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు అంతే కాకుండా పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గిరీశ్వర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి,చాకర్ వలి, రఘురాం రెడ్డి,దామోదర్ రెడ్డి మందడి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.