NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఫైర్       

1 min read

పల్లెవెలుగు వెబ్, పత్తికొండ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  తీవ్రస్థాయిలో  ఫైర్ అయ్యారు. గురువారం స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యంగాస్త్రాలు వేశారు. గ్రామస్థాయిలో పరిశీలిస్తే ప్రజల కష్టాలు, వాటి పరిష్కారాలు అర్థమవుతాయని చురకలుఅంటించారు.  అవగాహన లేని రాజకీయాలు చేస్తూ, నోటికొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.కరోనా సమయంలో నీవు,30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారు ఎక్కడికి పోయారోనని ప్రశ్నించారు. రక్తసంబంధీకులు కూడా పట్టించుకోని సమయంలో రాష్ట్రంలో వాలంటీర్లు సేవలందించారని గుర్తు చేశారు. వాలంటీర్ల సేవలను పక్క రాష్ట్రాలు కూడా అభినందిస్తూ,అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ జిల్లా నాయకులు శ్రీరంగడు, ఎంపీపీ నారాయణదాసు, వైస్ ఎంపీపీ బలరాముడు, పల్లె ప్రతాప్ రెడ్డి, కారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author