సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే కాటసాని
1 min read
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : మండలం రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని సోమవారం ఆళ్లగడ్డ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం బనగానపల్లె నియోజకవర్గం పలు అభివృద్ధి పనుల గురించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట వివరాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి సవివరంగా వివరించారు. తక్షణమే రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించేలా అధికారులను ఆదేశించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే కాటసాని కోరినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాటసాని వెంట ఎంపీడీవో శివరామయ్య తదితర అధికారులు వైసిపి నాయకులు ఉన్నారు.