ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోపశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని, ఉపాధ్యాయ శాసనమండలి వైయస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రామచంద్రారెడ్డి గారిని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పట్టణంలోనీప్రభుత్వ డిగ్రీ కళాశాల,రవికిరణ్ పబ్లిక్ స్కూల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ హై స్కూల్,కంకర గుర్రెడ్డి డిగ్రీ మరియు జూనియర్ కళాశాల,SV డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కళాశాల,ధాత్రి పబ్లిక్ స్కూల్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు,వైయస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ వెన్నపూస రవీంద్రారెడ్డి గారి క్రమసంఖ్య మూడో నెంబరు మొదటి ప్రాధాన్యత ఓటు .పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి వైయస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డి క్రమ సంఖ్య 11వ నెంబరు ఒకటవ ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు.ఈనెల 13వ తేదీన జరగబోయే శాసనమండలి వైయస్సార్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు..బనగానపల్లె పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల,రవికిరణ్ పబ్లిక్ స్కూల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ హై స్కూల్,కంకర గుర్రెడ్డి డిగ్రీ మరియు జూనియర్ కళాశాల,SV డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కళాశాల,ధాత్రి పబ్లిక్ స్కూల్ లలో బనగానపల్లె ఎమ్మెల్యేకాటసానిరామిరెడ్డిగారుఉపాధ్యాయుల,పట్ట భద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యునిగా వైయస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా రామచంద్ర రెడ్డి గారిని, పశ్చిమ రాయలసీమ పట్ట భద్రుల శాసన మండలి వైయస్సార్ పార్టీ అభ్యర్థిగా వెన్న పూస రవీంద్రా రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఉపాధ్యాయులను కోరారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకురావడం జరిగిందని అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. ఎన్నడూ లేని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికతో పాటు హాజరు శాతం కూడా పెరగడం జరిగిందని అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే 36 ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి రామచంద్ర రెడ్డి గారిని అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైయస్సార్ పార్టీ బలపరిచిన శాసనమండలి అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం జగనన్నకు కానుకగా ఇవ్వాలని చెప్పారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు ఉన్న సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధాన అమలు చేయడంలో మరియు ఉమ్మడి సర్వీసులు సమస్య పరిష్కరించి పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ ఇఓ, డైట్, ఎస్సీఈఆర్టీ లలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ మరియు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చలర్స్ గా పదోన్నతులు ఇప్పించడం, మున్సిపల్ ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యం, పదోన్నతులు, బదిలీలు ఇతర సమస్యలు పరిష్కారంలో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్ర రెడ్డి గారు అవిరాల ఖుషి చేస్తున్నారని సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అయ్యేటట్లు తాను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తానని ఇవే కాకుండా విద్యా, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఉద్యోగంలో తలెత్తే వ్యక్తి పరమైన సమస్యలను కూడా పరిష్కరించడానికి ఎంపీ రామచంద్ర రెడ్డి గారు తన వంతు కృషి చేస్తారని అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పారు.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైయస్సార్ పార్టీ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంతో ముడిపడి విద్యార్థి దశలోనే రాష్ట్రస్థాయి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగిందని విద్యారంగ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని చెప్పారు. ఉన్నతవిద్య పూర్తి చేసి హైకోర్టు న్యాయవాదిగా నిరుద్యోగ, ఉద్యోగుల కేసులను వాదించడం జరిగిందని పేదల న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా రాప్తాడు మండల జడ్పిటిసిగా గెలిచి ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారని అలాంటి వ్యక్తి మనకు శాసనమండలి అభ్యర్థిగా గెలుస్తే శాసన మండలి సభలో మన గళం ను వినిపించ గలుగుతారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగాఇవ్వాలనిపట్టభద్రులకు,ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్,ఎమ్మెల్సీ అభ్యర్థి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసులు,నారాయణ,పాన్ బీడ వలి,సుధాకర్ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.