ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల
1 min read
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ప్రజల సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలను డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి జారీ చేశారు. ఈ సందర్భంగా ప్యాపిలి మండల పరిధిలోని నలుమూల గ్రామంలోని ప్రజలు సమస్యలను అర్జీలు ఎమ్మెల్యే కు సమర్పించారు. తమ పరిష్కారాలను సంబంధించిన ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు లక్క సాగరం లక్ష్మిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి,ఎంఆర్ఓ భారతి, ఎంపిడిఓ శ్రీనివాసుల రావు,పిఆర్ ఎఇ ప్రభాకర్ రెడ్డి, తెదేపా మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాసులు, ముస్లిం మైనారిటీ నాయకులు ఖజాఫీర్, రామేష్ రెడ్డి,చండ్ర పల్లె లక్ష్మి నారాయణ యాదవ్,గోల్ల రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర,రాజా రవి, ఎస్ కే వలీ, ప్రతాప్ రెడ్డి, మాధవరం స్వామి, అది రెడ్డి,రామాంజీనేయులు,మదుశేఖర్ తదితరులు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.