కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే..మాండ్ర
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా శనివారం రాత్రి 8 గంటలకు కర్నూలు ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జీ మాండ్ర శివానందరెడ్డి రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను వారు పరిచయం చేసుకొని క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలని వారు క్రీడాకారులతో అన్నారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొంటున్నారని ఆర్గనైజర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు,వంగాల శివరామిరెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు ప్రమోద్ రెడ్డి, సుధాకర్ యాదవ్,రామేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.