నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం..
1 min read– పెదపాడు నుండి పిరికిడు వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులు,నిర్మాణం..
– క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలసి ఆర్ అండ్ బి ఉన్నతా ధికారులు మరియు వైసిపి నాయకులతో పెదపాడు నుండి పెరికీడు వరకు నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులోగా రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.