PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి  కార్యకర్తకు నివాళులర్పించిన ఎమ్మెల్యే 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు టౌన్ బెస్తకాలనికి చెందిన  బోలా వెంకట శివ మంగళవారం అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది , బోలా వెంకట శివ అందరితో కలుపుగోలుగా ఉంటూ, అందరినీ స్నేహపూర్వకంగా మాట్లాడడంతో పాటు చిన్న వయసులోనే వైయస్సార్సీపి పార్టీకి బెస్త కాలనీలో వెన్ను దన్నుగా నిలవడం జరిగింది, అలాంటి వ్యక్తి అనారోగ్యంతో నేడు మన మధ్య లేడనే వార్త విని గ్రామంలోని వెంకట శివ బంధువులు, మిత్రులు గ్రామస్తులు బోరున విలిపించారు, విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి మండల నాయకులు జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఆర్ వి ఎస్ ఆర్, చీర్ల సురేష్ యాదవ్, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, జె సి ఎస్ ఇంచార్జి శ్రీనివాసరాజు పలువురు మృతుడు బోల వెంకట శివ ఇంటికి చేరుకొని వెంకట శివ పార్టీవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట శివ, చిన్న వయసులోనే మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని, అంతేకాకుండా గ్రామంలో, పార్టీ పరంగా  మంచి మన్ననలు పొందారని కొనియాడారు అతని మృతి పార్టీకి తీరనిలోటని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు…. వెంకట శివ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే…….. ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బోలా వెంకట శివ మృతి చెందాడు అన్న విషయాన్ని తెలుసుకొని బుధవారం మృతుని ఇంటికి చేరుకొని మృతుడు వెంకట శివ  పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ, బోల వెంకట శివ చిన్న వయసులోనే అనారోగ్యం తో మృతి చెందడం బాధాకరమన్నారు, ఆయన మృతి పార్టీకి తీరని లోటని, పార్టీ కొరకు చాలా కష్టపడ్డారని ఆయన తెలియజేశారు, అలాగే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి  వారి కుటుంబానికి ధైర్యాన్నిస్తూ, ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు, కాగా మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కలరు.

About Author