భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని ముండ్లపల్లె గ్రామపంచాయతీలో స్మశాన వాటికకు రహదారి లేక చాలా అవస్థలు పడుతున్నామని అక్కడి ప్రజలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం ఆయన ముండ్లపల్లె లో స్మశాన వాటిక రహదారి కొరకు( సిమెంట్ రోడ్డు) భూమి పూజ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముండ్లపల్లె గ్రామపంచాయతీలో స్మశాన వాటికకు రహదారి, అదేవిధంగా గ్రామంలో కూడా రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక్కడి ప్రజలు నాయకులు నా దృష్టికి తీసుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు వెంటనే ఆ పనులకు సంబంధించి స్పందించి జిల్లా పరిషత్ నిధుల నుండి 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు, ఇచ్చిన మాట ప్రకారం నాలుగు లక్షలు స్మశాన రహదారికి, మరో నాలుగు లక్షల రూపాయలతో గ్రామంలో రహదారి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు, ఈ పనులు కూడా వారం పది రోజులలో పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఏవైనా సమస్యలు ఉన్నచో తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే ఆ పనులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు, కార్యక్రమంలో చింతకొమ్మ దీన్నే జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి, గోసుల జనార్దన్ రెడ్డి, జిలాన్ భాష, రెడ్డి భాష, పెంచలయ్య, ఓబన్న, హరి, లక్ష్మయ్య రాజశేఖర్, సంటన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.