ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం
1 min readపల్లెవెలుగువెబ్ : అమలాపురంలో జరిగిన ఆందోళనల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధమైంది. కోనసీమ జిల్లాను కొనసాగించాలని స్థానిక జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. హౌసింగ్‌బోర్డు కాలనీలోని సతీష్ ఇంటికి నిప్పుంటించారు. ఈ ఘటనతో అధికార పార్టీ నేతల ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అమలాపురంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఉద్దేశ్వపూర్వకంగానే చేశారని ఆరోపించారు. విధ్వంసం ఘటనపై విచారణ జరిపి నిందితులను బయటకు లాగుతామని హెచ్చరించారు. విధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించారు.