PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీతారాముల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

1 min read

– అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: కళ్యాణోత్సవం అనంతరం గ్రామంలో మారెమ్మ ఆలయం చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు,అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గ్రామంలో నడుచుకుంటూ తన సొంత గ్రామస్తులతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ,అందరితో పలకరింపుగా మాట్లాడుతూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవమును గుండ్ల సింగవరం గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణమును బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ చేతుల మీదుగా కళ్యాణం రమణీయంగానిర్వహించారు. సీతారాముల స్వామివారి కల్యాణోత్సవానికి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి సత్యమని కాటసాని జయమ్మ దంపతులు కట్టుబస్త్రాలతో మేల తాళాలతో భాజాపతంత్రులతో గ్రామంలో ఊరేగింపుగా శ్రీ సీతారాముల ఆలయం వరకు నిర్వహించి కళ్యాణోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గ్రామంలో మారెమ్మ ఆలయము చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రస్తుత సమస్యలు గ్రామంలో ఏమున్నాయో వాటి గురించి గ్రామస్తులతో స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో మారెమ్మ స్వామి ఆలయంలో నిర్మించడం జరుగుతుందని అలాగే చెన్నకేశవ స్వామివారి ఆలయాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తమ సొంత గ్రామమైన గుండ్ల సింగవరం గ్రామంలో శ్రీ సీతారామ చంద్రుల స్వామివారి కళ్యాణం తమ చేతుల మీదుగా కన్నుల పండుగగా జరిగిందని చెప్పారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం జరుపుకోవడం జరిగిందని ఈ ప్రాంతమంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని సకాలంలో వర్షాలు బాగా పడే రైతులు ఆనందంతో ఉండాలని ఆ సీతారాముల స్వామి వారిని వేడుకోవడం జరిగిందని చెప్పారు. గుండ్ల సింగవరం గ్రామం తమ సొంత గ్రామం కాబట్టి గ్రామంలో రంగనాయకుల స్వామివారి ఆలయమును ఒక్కోటి 78 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే ఆలయ భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ గ్రామంలో చాలా రోజుల నుంచి రంగనాయకుల స్వామి వారి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం జరిగిందని చెప్పారు. తమ గుండ్ల సింగవరం గ్రామంలో ప్రజలందరూ ఒకే మాట ఒకే మాట ఒకే అభివృద్ధి నినాదంతో ముందుకు పోవడం జరుగుతుందని తమ గ్రామము ఒక ఆదర్శ గ్రామం అని చెప్పారు. గ్రామంలో గ్రామ పెద్దలు తమ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అందులో భాగంగానే గ్రామంలో డ్రైనేజీ లేకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే అవి అన్నిటిని కూడా గ్రామస్తులతో కలిసి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి , అవుకు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ,గుండ్ల సింగవరం గ్రామ ఉప సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి,గుండ్ల సింగవరం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉమ్మడి పెద్ద మునిరెడ్డి, ఉమ్మడి రాం పుల్లారెడ్డి ,చిట్టెం మద్దిలేటి రెడ్డి, సంగిరెడ్డి గారి శివారెడ్డి, కాటసాని శివారెడ్డి, కాటసాని అంకాల్ రెడ్డి, ఉమ్మడి పరమేశ్వర్ రెడ్డి, నారెడ్డి చెన్నై ఈశ్వర్ రెడ్డి, నారెడ్డి శివ శంకర్ రెడ్డి నారప్ప గారి శివారెడ్డి, కాటసాని లక్ష్మీ రామిరెడ్డి, కసిరెడ్డి అయ్యప్ప రెడ్డి, కోన రామ్మోహన్ రెడ్డి, గడ్డం చిన్న అంకాల్ రెడ్డి, కాటసాని వెంకటేశ్వర రెడ్డి, కాటసాని హనుమంత రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author