ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇక, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే.