నియోజకవర్గ విద్యా సమస్యలపై సమీక్షించిన ఎమ్మెల్యే…
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలలో గల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి మౌలిక వసతులు ఉపాధ్యాయుల కొరత తదితరు అంశాలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఎంఈఓ లతో స్థానిక ఎమ్మెల్యే కేయి. శ్యాం కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలోని పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు తాగునీరు మరుగుదొడ్లు సమస్య లేకుండా చూడాలని డీఈవో ఎంఈఓ లకు సూచించారు. అలాగే ఎక్కడైనా టీచర్ల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాలలు భవనాలు శిధిలావస్థలో ఉంటే వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.