ఇల్లు, ఆఫీస్ లేదు.. ఓట్లడగడానికి సిగ్గుండాలి: ఎమ్మెల్యే రోజా
1 min read
పల్లె వెలుగు వెబ్: మాజీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాబు తీరు వీధి రౌడీలా ఉందని ధ్వజమెత్తారు. దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబుకు కుప్పంలో ఇల్లు, కార్యాలయం కూడా లేదని ఎద్దేవా చేశారు. కుప్పం అభివృద్ధిని పట్టించుకోని బాబు.. ఓట్ల అడగడానికి సిగ్గుండాలని రోజా మండిపడ్డారు. తమ ప్రభుత్వం కుప్పంను అన్ని విధాల అభివృద్ధి చేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో బాబు ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టాభితో బూతు డ్రామాలు ఆడించిన బాబు, ఇప్పుడు కుప్పం వచ్చి బాంబు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. అయితే బాబు డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కుప్పం రండి తేల్చుకుందామని… బాబు అనడం హాస్యాస్పదంగా ఉందని రోజా పేర్కొన్నారు.