PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పంలో చంద్రబాబుకు తుక్కురేగొట్టారు: ఎమ్మెల్యే రోజా

1 min read


పల్లెవెలుగువెబ్: చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. కుప్పం విజయంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబును కుప్పం ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించారన్నారు. ఇకపై కుప్పంలో ఏ ఎన్నిక వచ్చిన వార్ వన్‌సైడేనని రోజా ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభంజనం ముందు ఎవరూ నిలబడలేరని అన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఇప్పటికీ ఇల్లు లేదని… దీంతో ఆయన్ను హైదరాబాద్ ఇంటికి తరిమేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పుకునే చంద్రబాబు.. కుప్పంలో బొక్కబోర్లా పడ్డారని రోజా సెటైర్ వేశారు. ఇక పెదబాబు, చినబాబు ఇద్దరూ తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాదుకు వెళ్లాలని సూచించారు. వైసీపీకి అధికారం కట్టబెట్టిన కుప్పం ప్రజలకు రోజా ధన్యవాదాలు తెలిపారు.

About Author