కట్ డ్రాయర్ తో ఎమ్మెల్యే పరుగులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆ ఎమ్మెల్యేకి ఆపుకోలేనంత కష్టం
వచ్చింది. ఆపుకుంటే ఏమౌతుందోనన్న భయంతో అన్నీ విప్పేసి పరుగు పెట్టాడు. రన్నింగ్ ట్రైన్ లో ఆ ఎమ్మెల్యే రన్నింగ్ చూసి కొందరు నవ్వుకుంటే.. మరికొందరు అసహ్యించుకున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే.. బీహార్ కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్. గోపాల్ మండల్ ట్రైన్ జర్నీలో ఉండగా.. వాష్ రూమ్ అర్జెంటైంది. దీంతో చొక్కా, ఫ్యాంటు విప్పేసి .. టవల్ భుజాన వేసుకుని బాత్ రూమ్ కి రన్నింగ్ చేశారు. ఇది చూసిన ఓ ప్రయాణీకుడు .. ఇదేంటీ అసహ్యంగా అంటూ ప్రశ్నించారు. వాష్ రూమ్ అర్జెంటు కావడంతో ఆ విషయం ఎమ్మెల్యే పట్టించుకోలేదు. వాష్ రూమ్ లో పని ముగించుకుని బయటకి వచ్చాక.. ఆ ప్రయాణీకుడిపై తన ప్రతాపం చూపాడు. ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా ? అంటూ విసురుగా నెట్టేశాడు. ఈ విషయం బయటకి తెలియడంతో .. ఆ ప్రయాణీకుడికి గోపాల్ మండల్ సారీ చెప్పారు.