PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోదండ రామస్వామి కళ్యాణంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

1 min read

– జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి,ఎంపిపి సుధా మాధురి లు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లెలోని కోదండ రామస్వామి ఆలయ పంచమవార్షికోత్సవం మినీ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన కోదండ రామస్వామి కళ్యాణంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి,ఎంపిపి సుధా మాధురి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోదండ రాముని దీవెనెలు ప్రజలందరికీ అంది సుభిక్షంగా ,సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు రంగా రెడ్డి, సర్పంచ్ ముసల్ రెడ్డి,ఎంపీటీసీ శ్యామ్, చంద్రారెడ్డి,భూషణ్ రెడ్డి, మోహన్ రెడ్డి,ధనుష్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు చుక్కా అంజనప్ప,ఆలయ కమీటీ సబ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author