PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాకింగ్ ట్రాక్ ల నిర్మాణాలును పరిశీలించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అధునాతన హంగులతో రాయచోటి పట్టణంలోని డైట్ హాస్టల్ ప్రాంగణంలో పార్క్, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణాలును చేపడుతున్నామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఆదివారం డైట్ హాస్టల్ ప్రాంగణంలో జరుగుచున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్ లుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ ట్రాక్,పార్క్, చిల్డ్రెన్స్ పార్క్,యోగ కేంద్రం,ఓపెన్ జిమ్ తదితర నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.ప్రాంగణంలోకి ఆకతాయిల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులుకు ఎంఎల్ఏ సూచించారు. ఈ సందర్బంగా అక్కడి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ RI మల్లికార్జున,వ్యవసాయ సలహామండలి సభ్యులు దిన్నేపాటి రవిరాజు పాల్గొన్నారు.

About Author