PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి పట్టణంలో నిదా పాఠశాల ఆధ్వర్యంలో చేసిన ఇఫ్తార్ విందులో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు,ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందును స్వీకరించారు. రంజాన్ మాసంలో దైవ చింతనతో నెల రోజుల పాటు నియమ బద్ద జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ , ఓర్పు, సానుభూతి,సేవా భావం వంటి సద్గుణాలు అలవడటంతో పాటు జీవితం లో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కోగలమనే ఆత్మ విశ్వాసం పెంపొందుతుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా బయారెడ్డి, వి ఆర్ విద్యా సంస్థల అధినేత వి ఆర్ రెడ్డి, నిదా కరెస్పాండెంట్ నిస్సార్ అహమ్మద్, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్ కొలిమి ఛాన్ బాష,వక్ఫ్ బోర్డ్ జిల్లా సభ్యుడు నవరంగ్ నిస్సార్, మూసా తదితరులు పాల్గొన్నారు.

About Author