అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి హామీ
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యం యల్ ఏ శ్రీకాంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారని స్థానిక అంగన్వాడీ నాయకులు తెలిపారు. ఎ పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీలు సీఐటీయూ నాయకులు స్థానిక గౌరవ శాసన సభ్యులుశ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని శుక్రవారం ఆయన ఛాంబర్ లో కలసి సమస్యలు వివరించారు . వాటిలో కొత్తగా తెచ్చిన యఫ్ ఆర్ యస్ వలన బాలింతలు గర్భవతులు కు సంపూర్ణ పోషణ పంపిణీ కి సాంకేతిక సమస్య ఉందని చెప్పగా వెంటనే గౌరవ శాసన సభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ఆర్ జెడి పద్మజ తో జిల్లా ఐసీడీయస్ పీడీ ధనలక్ష్మి గారితో పోన్ లో మాట్లాడి ప్రత్యామ్నాయంగా లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఫీడ్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయిస్తానని తెలిపారు.దేవపట్ల శెట్టిపల్లి అంగన్వాడీల కు 2022 ఆగస్ట్ పెండింగ్ జీతాలు ప్రాజెక్టులోనితొంబై మూడు మంది కి పెండింగ్ జీతాలు మరియు అంగన్వాడీల కు సంక్షేమ పథకాలు అమలయ్యేవిధంగా మినీ సెంటర్ల ను మెయిన్ సెంటర్ల గా జీతాల పెంపు జనాభాకనుగుణంగా అంగన్వాడీ సెంటర్ల పెంపు ,హెల్పర్లకు ప్రమోషన్ వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమం లోమున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష సీఐటీయూ జిల్లాప్రధాన కార్యదర్శిఎ.రామాంజులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యానియన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి భాగ్యలక్ష్మి ఉపాధ్యక్షురాలు పి.బంగారుపాప పి.ఖాజాబి డి. విజయమ్మ బి.నాగమణెమ్మ లు పాల్గొన్నారు.