సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి సమస్యలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్యాం కుమార్ గురువారం పత్తికొండ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే శ్యాం కుమార్ పట్టణంలోని ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు సైతం తమ కాలనీలో వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా త్రాగునీరు, రహదారుల అస్తవ్యస్తం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరాల అంతరాయం లాంటి అంశాలను ప్రధానంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వచ్ఛ పత్తికొండ ను ఏర్పాటు చేసేందుకు పత్తికొండ పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. పత్తికొండ పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసుకొని త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంట మండల అధికారులు, టిడిపి నేతలు కార్యకర్తలు ఉన్నారు.
