ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించండి
1 min readకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మైనార్టీ నాయకుడు డిఎస్ బాష,
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు డి ఎస్ బాషా కోరారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి బలోపేతం కోసం కృషి చేస్తున్నానని అన్నారు. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఆలూరు గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.వెనుకబడిన ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఓబీసీ సెల్ చైర్మన్ చాకలి మంగయ్య, మైనార్టీ నాయకుడు నూర్ తదితరులు పాల్గొన్నారు.