NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే టికెట్ వారికే.. జ‌గ‌న్ స్ప‌ష్టం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎమ్మెల్యేలకు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ‘గ్రాఫ్‌ పెంచుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్లు ఇస్తానని… సర్వేలో సానుకూలత లేని వారు తనను తిట్టుకున్నా.. టికెట్లు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై మరోసారి వర్క్‌షాప్‌ నిర్వహించారు. ‘‘ఎన్నికలకు మరో 20 నెలలు మాత్రమే సమయముంది. 14 నెలల్లోనే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. మరో ఆరు నెలల్లోనే అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకుంటాను. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు కేటాయిస్తా. గెలిచేవారికే టికెట్‌. ఇందులో మొహమాటమేమీలేదు. చివరికి… నా కోసం త్యాగం చేసిన వారికి కూడా అభ్యర్థిత్వం విషయంలో మినహాయింపులు ఉండవు’’ అని జగన్‌ స్పష్టం చేశారు.

                                                 

About Author