వైసీపీ కార్యకర్తల పై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారంటూ సొంత పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 2019 ఎన్నికల్లో ఇల్లు అమ్ముకున్న ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు రూ.500 కోట్ల అక్రమ సంపాదన ఎలా వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ కార్యకర్తలు పోస్టులు వైరల్ చేశారు. రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన గద్దె కేశవరెడ్డి ఫిర్యాదు మేరకు ప్రసన్నాయపల్లి.. అయ్యవార్లపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలపై రాప్తాడు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.