ఎమ్మెల్యే వర్సెస్ బందిపోటు దొంగ !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజస్థాన్ కు చెందిన ఓ ఎమ్మెల్యేకు, బందిపోటు దొంగకు మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లు నడిచాయి. 120కిపైగా కేసులు ఉన్న ఆ దోపిడీ దొంగ పేరు జగన్ గుర్జార్. ధోల్‌పూర్‌లో కొందరు దుకాణదారులతో ఇటీవల గొడవపడిన గుర్జార్ గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపాడు. దీంతో దుకాణదారులందరూ కలిసి పోలీసులకు, బారి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధోల్‌పూర్‌లోని దంగ్ ప్రాంతంలో గుర్జార్ కోసం వేట ప్రారంభించారు. తన కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలుసుకున్న దొంగ.. ఎమ్మెల్యేనే తనపై పోలీసులను ఉసిగొల్పారని భావించాడు. ఆ వెంటనే ఆయనను బెదిరిస్తూ ఓ వీడియోను విడుదల చేస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశాడు.