కేంద్రమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే…
1 min read
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక.
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : పాణ్యం నియోజకవర్గంలో జరిగే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మరియు పీ-4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఈరోజు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలుకు రానున్న నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గాను శుక్రవారం ఓర్వకల్లు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకేతో ఎమ్మెల్యే స్వాగతం పలికారు.కర్నూలు కలెక్టర్ పి రంజిత్ బాష,ఎస్పీ విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ కేంద్ర మంత్రికి ఓర్వకల్లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.తర్వాత కర్నూలులో సీఎం పర్యటన ఏర్పాట్లను వారు పరిశీలించారు.