ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే
1 min read– నేడు జిల్లా ఆసుపత్రి లో అందిచే వైద్యం ఇక్కడే అందుబాటు లోకి ..
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం లో 22 కోట్ల రూపాయలతో నూతనంగా బనగానపల్లె ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది . త్వరలోనే మన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయడానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు . అందులో భాగంగానే నేడు ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులు ,వైద్య సిబ్బంది ,కాంట్రాక్టర్ లతో కలిసి పనులను పరిశీలించారు .కరొనా పరిస్థితులలో కూడా భవన నిర్మాణాంను చాలా చక్కగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ మహేశ్వర రెడ్డి గారిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు నేడు పథకం ద్వారా వైద్య ,విద్యా రంగాలకు పెద్ద పీట వేసి అన్నీ మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది అని చెప్పారు . అందులో భాగంగానే బనగానపల్లె 50 ప్రభుత్వ ఆసుపత్రి ని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తో బనగానపల్లె పట్టణ వాసుల కల నెరవేరబోతుంది అని త్వరలోనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షహేతుల మీదుగా ప్రారంబించడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు . ఏరియా ఆసుపత్రి ప్రారంభం అయితే 23 మంది డాక్టర్స్ అందుబాటులో వుండి వారి సేవలను ప్రజలు ఉపయోగించుకొంటారు అని ఇప్పటికే 15 మంది డాక్టర్స్ అందుబాటులో వుండి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది అని చెప్పారు . ఇప్పటికే ముక్కు ,చెవి ,గొంతు ,చర్మ వ్యాధి ,ఎముకల డాక్టర్ లు అందుబాటులో వున్నారు అని త్వరలోనే మత్తు డాక్టర్స్ కూడా రావడం జరుగుతుంది అని త్వరలోనే అన్నీ సేవలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పారు .ఈ కార్యక్రమం లో అవుకు మండల వైఎస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ,సిద్దం రెడ్డి రామ్ మోహన్ రెడ్డి,వైఎస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సైన్ ,అత్తార్ జాహీద్ హుస్సైన్ ,ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శిరిషా,సీనియర్ వైద్య నిపుణురాలు డాక్టర్ సుజాత,మండల అభివృద్ది అధికారి శివ రామయ్య ,ఆసుపత్రి భవనాల శాఖ డివిజనల్ ఇంజినీర్ నరసింహ రెడ్డి, ఆసుపత్రి కాంట్రాక్టర్ మహేశ్వర రెడ్డి,పంచాయతీ రాజ్ డివిజనల్ ఇంజినీర్ నాగ శ్రీనివాసులు ,రోడ్లు భవనం శాఖ డివిజనల్ ఇంజినీర్ సునీల్ రెడ్డి,బండి బ్రహ్మనంద రెడ్డి,ఎర్రగుడి రామ సుబ్బారెడ్డి,బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి,గౌండకంబగిరి,వైఎస్సార్పార్టీనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.