పగిలిన నర్సింగప్ప కొండను పరిశీలించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్ల ఎస్సీ కాలనీలో ఎండ వేడిమికి ఆదివారం పగిలిన కొండ రాయిని మంగళవారం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పరిశీలించారు. అధికారులతో, కాలనీవాసులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఎండవేడిమికి కొండరాయి పెద్దగానే చిలింది. ప్రమాదం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని,ప్రత్యుమ్నయ చర్యలు తీసుకునే వరకు కొండ పరిసర ప్రాంతంలో నివాసాలు ఉంటున్న కుటుంబాలు వేరే ప్రాంతంలో సెల్లర్ ఏర్పాటు చేసినారు. అలాగే ఈ కొండ ప్రాంతం సమీపంలో ఉన్న నివాసకుటుంబీకులకు అధికారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. మండల తహసిల్దార్ వేణుగోపాల్, ఇన్చార్జి ఎంపీడీవో నగేష్, ఎస్సై తిమ్మారెడ్డి, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిని, జియాలజిస్ట్ వెంకటేశ్వరరావు లతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకొని కొండను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసురుద్దీన్, బాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. మన్సూర్, కాశీ విశ్వనాథ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ దొరబాబు, గోవిందు, రహిమన్, రాముడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.