పద్మశాలీల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన ఎమ్మెల్యే
1 min read– నన్నపనేని సురేంద్ర క్షమాపణ చెప్పాలి..రాయలసీమ శకుంతల
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. TRS… MLA నన్నపనేని సురేంద్ర మా నేతన్న దగ్గరికి వెళ్లి GST 5% పోస్ట్ కార్డు కార్యక్రమంలో పాల్గొంటూ. పద్మశాలీయులు దైవంగా భావించే మగ్గాలపై కాళ్లు వేసి పద్మశాలీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన నన్నపనేని సురేంద్ర గారు పద్మశాలీలందరికీ క్షమాపణ చెప్పాలని రాయలసీమ శకుంతల డిమాండ్ చేశారు. మీరు గెలవడం కోసం మీ డిబేట్ ల కోసం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా కరెక్ట్ కాదన్నారు. అయ్యా కేటీఆర్ గారు మీరు కూడా చేనేత జోలి శాఖ మంత్రి అయి ఉండి ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారు. నన్నపనేని సురేంద్ర గారితో క్షమాపణ చెప్పించాలి. అయ్యా పుట్టినప్పటి నుండి చచ్చే వరకు బట్టే కావాలి. మార్కండేయ వంశస్తులమైన మేము మగ్గాలను దైవంగా కొలిచి చెప్పులు వదిలి మగ్గాలు నేస్తాము. మీరు కూడా ప్రతి శనివారం ఖద్దర్ బట్టలు వేసుకోండి అని నీతులు చెప్తారు. ఈరోజు ఆ వస్త్రాలు ఇచ్చిన నేతలు మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం కేటీఆర్ గారు, బీసీలమైన పద్మశాలీల ఓట్లు దండుకుంటారు మా ఆత్మగౌరవం మా మనోభావాలు మీకు అక్కర్లేదా అని పద్మశాలిఆడపడుచు గా ప్రశ్నిస్తున్నాను. ఎలక్షన్ల గందరగోళంలో బీసీలమైన పద్మశాలీలను కించపరిచే విధంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న బిజెపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నాయి. చోద్యం చూస్తూ మాకెందుకులే అని వదిలేశారా! పార్టీల నేతలకు కనపడడం లేదా. ఖబర్దార్ నాన్నపనేని సురేంద్ర గారు పద్మశాలియులకు క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు త్రీవంగా ఉంటాయని హెచ్చరింస్తున్నాము.