అభివృద్ధి పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయిస్తున్న ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణం 6వార్డులో బ్రిటీష్ కాలంలో వేసిన కల్వలు పాడైపోవడంతో కొత్త కాల్వలు కొత్త CC రోడ్లు వేయిస్తున్న బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసానిరామిరెడ్డి గారు.MLA గా గెలిచిన వెంటనే మొదటి విడతలో 6 వార్డులోని గౌండా వీధిలో 20 లక్షల రూపాయలతొ కొత్త కాల్వలు CC రోడ్డు వేయించిన ఎమ్మెల్యే కాటసాని గారు. రెండవ విడతలో భాగంగా రెండు చోట్ల ఖాజీవాడాలో మెయిన్ కాల్వ దాదాపు 25లక్షలు వెచ్చించి కొత్త డ్రైనేజి పనులు కాంట్రాక్టర్ ఆంజనేయులు గారి ద్వారా పూర్తి చేయించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్న గారు.నేడు మూడో విడతలో భాగంగా ఖాజీవాడా మసీద్ దగ్గర రెండోవైపు ఉన్న కాల్వ మోరి క్రింద మొత్తం బండలు కాల్వలో పడి బ్లాక్ కావడంతో కాల్వలో మురికి నీరు పారేవి కాదు చిన్న వర్షం పడినా మసీదు & ఆపరిసర ప్రాంతం అంతా వర్షపు నీరు రోడ్డుపై మరియు మసీద్ దగ్గర ఆగిపోయేవి.ఈ వర్షపు నీళ్లు కాల్వ గుండా పోకపోవడంతొ కాలువలో నిలువ ఉన్న మురికినీరు మొత్తం రోడ్డుపైకి ముఖ్యంగా ఖాజీవాడ మసీద్ ముందర ఆగిపోయి ఆ పరిసర ప్రాంత ప్రజలు మసీదుకు వెళ్లి నమాజ్ చేసుకునే ముస్లిం సోదరులు దుర్వాసనతో దోమలతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు.ఒక సమయంలో వర్షం పడే రోజుల్లో రెండు మూడు రోజులు నమాజ్ కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేది.ఇక్కడి పరిస్థితులు మొత్తం మా 6వ వార్డు కార్యకర్తలం మరియూ ప్రజలు వెళ్లి గౌరవ ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది వెంటనే స్పందించిన గౌరవ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఎంపీడీవో శివరామయ్యగారి చెప్పి నమాజ్ చేసుకునే ముస్లిం సోదరులకు అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వెంటనే కొత్త డ్రైనేజీ పనులు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీవో శివరామయ్య గారు ఈవో ఖలీల్ గారు ఖాజీవాడ మసీద్ ప్రాంతం దగ్గరకు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి హుటాహుటిన RWS డిపార్ట్మెంట్DEఉమాకాంత్ రెడ్డి AE సాయికృష్ణ గారితో మాట్లాడి 3,50,000/- రూపాయలు శాంక్షన్ చేయించి స్థానిక బనగానపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ గారి భర్త మాజీ MPTC రైస్ మిల్ & పాలిష్ ఫ్యాక్టరీ ప్రోప్రైటర్ ఈసారి ఎల్లయ్య గారి చే ఈ కాల్వపనులు చేయించడం జరిగింది.ఈ సందర్భంగా ఇరువైపులా కాలువలు పూర్తి కావడంతో దుర్వాసన లేకపోవడం మరోవైపు కాల్వలు వేసిన ఆయా ప్రాంతాల్లో దోమలు అస్సలు లేకపోవడంతొ ఇక్కడి ప్రజలు ముఖ్యంగా ఖాజీవాడ మసీదులో నమాజ్ చేసుకునే ముస్లిం సోదరులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నగారికిఅభినందనలుకృతజ్ఞతలుతెలియపరుస్తూ సంతోషం వ్యక్త చేశారు.