వైఎస్సార్ అసరా పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: మాట తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి అక్క చెళ్ళమ్మలకు అండగా ఉంటూ వారి మొహాల్లో చిరునవ్వులు నింపాలనే ఒక్క ధ్యేయంతో వరుసగా మూడవ ఏడాది కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ అసర నిధులను నేరుగా అక్క చెళ్లమ్మల ఖాతాలలో జమచేయడం జరిగింది. వరుసగా మూడవ ఏడాది “వైయస్ఆర్ ఆసరా”మూడవ విడతగా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ గారు జమాచేయడం జరిగింది.ఈ మేరకు వెలుగోడు మండలానికి 879 పొదుపు సంఘాలకు గాను 7 కోట్ల 26 లక్షల 67వేల 224 రూపాయల చెక్కును ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి చేతుల మీదుగా పొదుపు సంఘాల మహిళలకు అందజేయడం జరిగింది.సమావేశంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండి వారికి ఏ కష్టం వచ్చిన ముందు ఉండి సహకరిస్తాను అని హామీ ఇచ్చి వారి మొహాల్లో చిరునవ్వును నింపడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న వివిధ సంక్షేమ పథకాలు వైఎస్సార్ ఆసరా సున్నావడ్డి చేయూత పెన్షన్ కానుక ఇలా ఎన్నో పథకాల ద్వారా మహిళల కోసం నిరంతరం కృషి చేస్తున్నందున మహిళలు మాకు ఒక గొప్ప గౌరవం దక్కింది అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారితో తెలపడం జరిగింది.ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట తప్పకుండా క్రమం తప్పకుండా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్ననే అని గర్వంగా చెప్పడం జరిగింది మహిళలు ఎనలేని సంతోషంతో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మళ్ళీ మాకు జగనన్న నే ముఖ్యమంత్రిగా శిల్పన్ననే ఎమ్మెల్యేగా కావాలంటూ ప్రతి ఒక్కరు ఈరోజు వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేస్తూ చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.