ఆర్వో ప్లాంటును ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో గల నర్సారెడ్డి పల్లె గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఆరో ప్లాంటును పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి తో పాటు రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వీర ప్రతాపరెడ్డి తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 25 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు త్రాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు, కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా ఫ్లోరిఫైడ్ వాటర్ లేకుండా స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్ ను అందించడం జరుగుతుందన్నారు, ఇప్పటికే కమలాపురం లో నాలుగు, వీరపనాయని పల్లె లో4, అదేవిధంగా చెన్నూరు4, చింతకొమ్మదిన్నె మండలంలో5, పెండ్లిమర్రి మండలంలో5 , వల్లూరు మండలంలో3, ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ ఎర్రసాని నిరంజన్ రెడ్డి, ఎరసాని రాజ గోపాల్ రెడ్డి, సంపూర్ణ రెడ్డి, ఓబుల్ రెడ్డి, కొండారెడ్డి, నవనీశ్వర్ రెడ్డి, పెద్ద కొండ రెడ్డి, వీరారెడ్డి, రమణారెడ్డి ,రామిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, తోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.