శ్రీమద్ది ఆంజనేయ స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే
1 min readఆలయ మర్యాదతో స్వాగతం పలికిన ఈవో ఆకుల కొండలరావు
వివిధ సేవల రూపేనా రూ:1,14,942/-లు ఆదాయం
పెద్ద సంఖ్యలో భక్తులకు అన్న ప్రసాద వితరణ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో కార్తీకమాసోత్సవములలో సందర్భముగా ఈరోజు ఆలయ అర్చకులు ఉదయం గం4.00లకు నిత్య అర్చన, తోమాలసేవ, నిత్య హోమబలిహరణలు, ఉత్సవమూర్తులకు విశేష అష్టోత్తర పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనమునకు అనుమతించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి శాలువా కప్పి పుష్పంకుచ్చేo అందించారు. కార్తీకమాసం చివరి రోజు మరియు మంగళవారం కావడంతో వేకువ జామునుండియే అధిక సంఖ్యలో భక్తులు, స్వాములు విచ్చేసి శ్రీస్వామివారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించారు. భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేయబడినది. ఆలయము వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.4,14,942/- లు సమకూరినది. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారని, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఉత్సవములు దిగ్విజయముగా నిర్వహించుటకు ఉత్సవ కమిటీ ఛైర్మన్ మరియు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. అద్దయ్య ఆదేశముల మేరకు పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ శాఖ, R.W.S. శాఖ, అగ్నిమాపక శాఖ, జంగారెడ్డిగూడెం ఆర్.టి.సి. డిపో వారు, విద్యుత్ శాఖవారు తదితర శాఖల అధికారులకు మరియు ఈ నెలరోజులు కార్యక్రమములు ఎప్పటికప్పుడు భక్తులకు అందించిన ఎలక్ట్రానిక్, అండ్ ప్రింట్ మీడియా వారికి ఆలయము తరపున కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ధన్యవాదములు తెలియజేశారు.