NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే…ఎమ్మెల్సీ

1 min read

– ఘనంగా పూజలు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో వైయస్సార్సీపి సీనియర్ నాయకులు కడుమూరు సల్కోటి గోవర్ధన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజలు మరియు కోలాటం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు సోమవారం మధ్యాహ్నం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ హాజరై 700 చరిత్ర గల దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి దేవాలయంలో పూజారి వీర కుమార్ పూజలు చేస్తూ భజంత్రీ పాటలు మరియు గని వారు చేసిన నందికోలా సేవ ఘనంగా చేశారు.అనంతరం దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదర్శన చేశారు.టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి, సుభాన్ పూజలు చేశారు.అనంతరం సల్కోటి గోవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు విందును స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కమతం రాజశేఖర రెడ్డి,వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య,కేడీసీసీ మాజీ చైర్ పర్సన్ మల్లికార్జున రెడ్డి,వైసీపీ జిల్లా కార్యదర్శి మరియు పట్టణ మహిళా కార్యదర్శి డాక్టర్ వనజ,కౌన్సిలర్ ధర్మారెడ్డి,వైసీపీ జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇ నాయతుల్ల,తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,మాసపేట వంగూరు జనార్దన్ రెడ్డి, ఉప్పలదడియ మహేశ్వరరెడ్డి,కమతం వీరారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,జాన్,నాగన్న,సల్కోటి గోవర్ధన్ రెడ్డి వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author