పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఒడిశా పుల్బానీ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్.. శుక్రవారం మొదలైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. రుజంగీ హైస్కూల్ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. 1978లో పదో తరగతి దాకా వెళ్లిన ఆయన.. కుటుంబ సమస్యలతో పరీక్షకు హాజరు కాలేకపోయాడట. అయితే వయసు పైబడిన వాళ్లెందరో.. బిడియాన్ని పక్కనపెట్టి పరీక్షలకు హాజరవుతుండడం తాను గమనించానని, అందుకే తాను తన విద్యను పూర్తి చేయాలనుకుంటున్నానని అంగద చెప్తున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటున్నాడు.