PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు ఎమ్మెల్యే చెన్నూర్ కి రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నేడు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని మండల వైయస్సార్ సిపి నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు చెన్నూర్ టౌన్ నందు గురువారం 9:30 గంటలకు 1వ వార్డులో గల రైతు భరోసా కేంద్రం, అలాగే వైయస్సార్ విలేజ్ క్లినిక్ శాసనసభ్యలు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు, అలాగే ఉదయం 10 గంటలకు 3వ సచివాలయ పరిధిలో గల భారతి స్కూల్ ఆవరణంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారనీ వారు తెలియజేశారు, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు.

About Author