NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు కొక్కరాయపల్లె కు ఎమ్మెల్యే రాక

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు : గడప గడపకు ప్రభుత్వం లో భాగంగా నేడు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నూరు మండలం లోని కొక్కరాయపల్లె గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కమలాపురం శాసనసభ్యులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి రానున్నట్లు ఎంపీడీవో జాన్ వెస్లీ తెలిపారు, శుక్రవారం ఆయన విలేఖర్ల తో మాట్లాడుతూ,గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా, కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, ప్రభుత్వం తరఫున ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో వివరిస్తారని వారు తెలిపారు, అంతేకాకుండా ఆయా గ్రామ సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని ఆయన తెలిపారు, కావున ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు, గ్రామసచివాయ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

About Author