అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : బీర్భూమ్ హింసాకాండ అంశం పశ్చిమబెంగాల్ అసెంబ్లీని సోమవారంనాడు కుదిపేసింది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర గలభా చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రతిఘటించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకదశలో ఒకరితో ఒకరు కలబడటంతో పలువురు గాయపడినట్టు ఇరుపార్టీల నేతలు మీడియాకు వెల్లడించారు.