ఎస్సీ హాస్టల్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి… విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్సీ హాస్టళ్లు ఏర్పాటుకు ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి కృషి అభినందనీయం.విద్యార్థి సంఘాలు. చాలా ఏళ్లుగా ఎమ్మిగనూరులో ఎస్సీ హాస్టళ్లు లేకపోవడం వలన చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు అని అనేక సార్లు గత వైసిపి ప్రభుత్వ హయాంలో కూడా పోరాటాలు చేయడం జరిగింది. అప్పట్లో ఈ ఉద్యమంలో విద్యార్థి సంఘాల నాయకుల పై అక్రమ కేసులు బనాయించడం జరిగింది అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి కి ఈ విషయం పలుమార్లు విన్నవించడంతో వెంటనే స్పందించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉన్నత అధికారాలకు దృష్టికి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి తీసుకెళ్లడం వలన దీనికి సంబంధించిన పక్కా భవనాలకు ఏర్పాటుకు నిధులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అన్నారు అందుకు ఎమ్మెల్యేకి అభినందలు తెలపడం జరిగింది అని విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్,నాగరాజు,ఖాజా,సురేష్, ఆఫ్రిది, రఘునాథ్ ,కృష్ణ తెలిపారు అనంతరం ఎమ్మిగనూరు లో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలినీ బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, కోసిగి ఎమ్మిగనూరు రహదారి పనులను ప్రారంభించాలినీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు దినకర్,అశోక్, విజయ్,వెంకటేష్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.