ఎమ్మెల్యే గ్రీవెన్స్ కు..విశేష స్పందన…
1 min read
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న:ఎమ్మెల్యే
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నిర్వహించిన గ్రీవెన్స్ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.వివిధ గ్రామాల ప్రజల నుండి 84 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ పి.దశరథ రామయ్య తెలిపారు.వచ్చిన దరఖాస్తుల్లో ఇంటి స్థలాలు, పింఛన్లు,భూ సమస్యలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ప్రజల సమస్యలను సాదరంగా వింటూ వీలైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముందుగా మిడుతూరు మండల కేంద్రంలో షాపుల వద్ద ప్లాస్టిక్ కర్ల నిషేధాన్ని చేయాలంటూ షాపుల నిర్వాహకులకు పాంప్లెట్స్ ఎమ్మెల్యే మరియు అధికారులు అందజేశారు. ప్రతి నెలా మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆటో స్టాండ్ వద్ద ఆత్మకూరు ఆర్డీఓ డి నాగజ్యోతి అధికారులు విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే జయసూర్య ప్రజలకు పిలుపునిచ్చారు.తర్వాత ఆటో స్టాండ్ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు కస్తూర్బా బాలికల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,గ్రామ సర్పంచ్ జయ లక్ష్మమ్మ,కమతం రాజశేఖర్ రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి,డాక్టర్లు రాజు,సాయినాథ్ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.
