అట్టహాసంగా ఎమ్మెల్యే రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర..
1 min readపైడి చింతపాడు ఆత్మీయ సదస్సులో
ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్..
విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు అశేషజన వాహిని..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు రూరల్ మండలంలోని పైడిచింతపాడు గ్రామంలో ప్రజలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహల మధ్య దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించడం జరిగింది. పైడిచింతపాడులో రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం కొల్లేరు ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. కొల్లేరు గ్రామం పైడి చింతపాడులో చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకంతో నాయకులతో అధికారులతో కిక్కిరిసి ఒక ప్రాంతం పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున కాల్చిన బాణాసంచారు, తీన్మార్ డప్పుల మోతలు, జై జగన్, జై అబ్బయ్య చౌదరి నినాదాలతో మార్మోగిన కొల్లేరు ప్రాంతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కి పూలమాలలు వేసి పాదయాత్రను మొదలు పెట్టిన ఎమ్మెల్యే ఆడపడుచుల ఆత్మీయ హారతులు, యువకుల కరచాలనాలు, ఏలూరు రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ప్రజల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కాయలతో కొనసాగిన పాదయాత్ర రాత్రి అయినా సమయాన్ని కూడా లెక్కచేయకుండా చివరి వరకు కొనసాగారు. మాజీ ఏపీ ఆయిల్ ఫిడ్ రైతు కమిటీ చైర్మన్ కొఠారు రామచంద్ర రావు , ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు , ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు , జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, కొల్లేరు ప్రాంత సీనియర్ నాయకులు మోరు రామరాజు, ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు, జడ్పిటిసి మండల సరస్వతి కొండలరావు, ప్రత్తి కోళ్లలంక వైస్ సర్పంచ్ మరియు ఇతర నేతలు అశేష జనవాహినిలో సమక్షంలో నిర్వాహకులు ఏర్పాటుచేసిన వేదికపై ముంగర సంజీవ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఘనంగా జరిగిన కొల్లేరు ఆత్మీయ సదస్సు లో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ముంగర సంజీవ్ కుమార్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరూ శాలువా కప్పి, భారీ గజమాలతో, బొకేలు అందజేసి ఆకాశానికి ఎగసిపడే బాణ సంచాకాల్చి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం అక్కడి సభలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వమే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, టిడిపి మాయ మాటలను నమ్మే పరిస్థితి లేదని చెబుతూ, వైసీపీ కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజల మద్దతుతో తాము 50 వేల మెజారిటీతో గెలవబోతున్నామని ప్రకటించారు. పైడిచింతపాడులో ఆప్యాయంగా ప్రజలతో మాట్లాడుతూ పాదయాత్ర నిర్వహిస్తూ, అక్కడ గ్రామ సచివాలయం భవనాన్ని మరియు మనబడి నాడు – నేడు కింద 13.36 లక్షలు మరియు 17.99 లక్షలతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. అలాగే అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను, విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు.పైడిచింతపాడులో పాదయాత్రను ముగించి అక్కడి నుండి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి జనకోలాహలంతో ప్రత్తికోళ్లలంకను చేరగా గ్రామస్తులు ఘన స్వాగతం తెలిపారు. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సమీపంలోని చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు అలాగే శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే అక్కడ పాదయాత్రను కొనసాగిస్తూ, బీసీ కాలనీలో 15 లక్షలు మరియు ఎస్సీ కాలనీలో 18 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం “పల్లె నిద్ర” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తనకు బస ఏర్పాటు చేసిన గృహానికి చేరి అక్కడ ప్రజల నుండి వినతులు స్వీకరించి, రెండో విడత మొదటి రోజు ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు.